పెదపూడి: బంధువుల ఇంటికి వెళ్లి చూసివద్దామనుకునేలోపే

1249చూసినవారు
పెదపూడి: బంధువుల ఇంటికి వెళ్లి చూసివద్దామనుకునేలోపే
పెదపూడి మండలం జి. మామిడాడలో గుణపు వీరవెంకట అప్పారావు, సత్యవతి దంపతుల చిన్న కుమారుడు వేణు మనోహర్ (23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నెల 3వ తేదీన స్నేహితుడితో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళిన వేణు మనోహర్, దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. త్వరలో వివాహం చేయాలని భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ దుర్ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.