గ్రామాల బాట పట్టిన పోలీస్ బాసులు.. ఎందుకో తెలుసా?

1చూసినవారు
గ్రామాల బాట పట్టిన పోలీస్ బాసులు.. ఎందుకో తెలుసా?
ఈనెల 14న జరగనున్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. SP ఆదేశాల మేరకు గురువారం SI నుంచి అదనపు SP వరకు అధికారులు గ్రామాల్లో విగ్రహ కమిటీలు, గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి, వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, అనుమానాలుంటే ముందుగా తెలియజేయాలని సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్