ఉప్పుటేరులో పడిన మహిళను రక్షించిన పోలీసులు

998చూసినవారు
ఉప్పుటేరులో పడిన మహిళను రక్షించిన పోలీసులు
కాకినాడ జగన్నాథపురానికి చెందిన చింత గంగ (35) అనే మహిళ సోమవారం ప్రమాదవశాత్తు ఉప్పుటేరులో పడిపోయింది.విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పీసీ అప్పన్నబాబు వెంటనే స్పందించి సహచర పీసీ ఫణికృష్ణ, సీఐ రమేశ్ లకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు గజ ఈతగాళ్లతో కలిసి నీటిలో దూకి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లను సీఐ రమేశ్ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్