మొంథా తుఫాన్ ప్రభావంతో ఏలేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో, నీటి మట్టం పెరిగి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. పరిసర పంట పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గండి మూసే పనులు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.