కత్తిపూడిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

1చూసినవారు
కత్తిపూడిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
కత్తిపూడి శివారు లారీ పార్కింగ్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. రాజమండ్రి నుంచి తుని వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కత్తిపూడికి చెందిన ఈసరపు దుర్గాప్రసాద్, కోన రామకృష్ణ, ఈసరుపు సూర్య వీరబాబులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరబాబును కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్