పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పులిని పట్టుకోవడానికి అటవీశాఖ 'ఆపరేషన్ హనుమాన్' ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, 200 మందికి పైగా అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. బెంగళూరు నుంచి నిపుణుల బృందం కూడా రంపచోడవరం చేరుకోనుంది. పులి కాకినాడ జిల్లా సరిహద్దుల వైపు వస్తుందేమోనని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.