కరప మండలంలోని ఉప్పలంక గ్రామాన్ని తుఫాను ప్రభావిత ప్రాంతంగా గుర్తించినట్లు తహశీల్దార్ దుర్గాప్రసాద్ తెలిపారు. గ్రామంలోని మత్స్యకారులతో పాటు ఇతరులకు బియ్యం, పంచదార, నూనె పంపిణీ చేశారు. మిగిలిన సహాయక వస్తువులు ఈరోజు చేరుతాయని, వాటిని కూడా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.