సామర్లకోట మండలం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో జరిగిన భారీ ప్రమాదం జరిగి 30 రోజులు పూర్తయింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతిచెందగా, బాధితుల కుటుంబాలు నేటికీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యాపారవర్గాల స్వార్థం, అధికార యంత్రాంగ వైఫల్యం కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని, కొందరి స్వార్థం అందరికీ శాపంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.