సోదరి పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తున్న విజయవాడకు చెందిన యర్రంశెట్టి రాజు (29) శనివారం అన్నవరం జాతీయ రహదారిపై దారుణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. యలమంచిలి వెళ్తుండగా, హెల్మెట్ సరిచేసుకునేందుకు బైక్ స్లో చేయగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో రాజు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI శ్రీహరి తెలిపారు.