ముమ్మిడివరం: గోదావరిలో యువకుడి మృతదేహం లభ్యం

580చూసినవారు
ముమ్మిడివరం: గోదావరిలో యువకుడి మృతదేహం లభ్యం
ముమ్మిడివరం మండలం కొత్తలంక- కేశనకుర్రు గోదావరి రేవులో శుక్రవారం ఈతకు దిగి కొత్తలంక గ్రామానికి చెందిన మంగా విజయ మణికంఠ గోదావరిలో గల్లంతయ్యాడు. యువకుడు ఓడలరేవు బి. వి. సి ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత 3 రోజులుగా గల్లంతైన యువకుడి కోసం పోలీసులు, స్థానికులు గోదావరిలో గాలిస్తున్నారు. ఆదివారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు తెలపడంతో బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్