భోజనం కోసం వచ్చి ప్రాణాలు దక్కించుకున్న 30 మంది

304చూసినవారు
భోజనం కోసం వచ్చి ప్రాణాలు దక్కించుకున్న 30 మంది
శనివారం సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో కార్మికుల సంఖ్యపై స్పష్టత లేదు. సుమారు 80 మంది పని చేస్తుండగా, 30 మంది భోజనానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, పరిశ్రమ లోపల సుమారు 50 మంది మహిళలు, వృద్ధులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కార్మికుల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్