గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత డాక్టర్ తాళాబత్తుల సాయి, కేవలం గంట సమయంలో సేవ కర్రతో 16 మిల్లీమీటర్ల ఎత్తు, 8 మిల్లీమీటర్ల వెడల్పుతో సూక్ష్మ కళాఖండాన్ని చెక్కారు. గొడ్డలితో చెక్కను నరుకుతున్నట్లుగా ఉన్న ఈ కళాఖండాన్ని ఆయన తయారు చేశారు. గతంలోనూ పలు సూక్ష్మ కళాఖండాలతో గిన్నిస్ రికార్డులు సాధించిన సాయి ప్రతిభను ప్రముఖులు, పట్టణ ప్రజలు అభినందించారు.