సామర్లకోటలో ఘోర ప్రమాదంలో యువకుడు మృతి

196చూసినవారు
సామర్లకోటలో ఘోర ప్రమాదంలో యువకుడు మృతి
సామర్లకోట రింగ్ రోడ్ సెంటర్ వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 21 ఏళ్ల పోతుల ఆకాష్ అనే యువకుడు మృతి చెందాడు. డ్రైనేజీలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన అతడిని మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత కాకినాడలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో బలుసుపేట ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్