మంగళవారం రాత్రి పెద్దాపురం దర్గా సెంటర్ మార్కెట్ వద్ద గల చెక్కల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దుకాణ నిర్వాహకులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రద్దీ ప్రాంతం కావడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.