పెద్దపురంలో ఆన్‌లైన్ మోసం.. రూ.85 లక్షలు మాయం

1194చూసినవారు
పెద్దపురంలో ఆన్‌లైన్ మోసం.. రూ.85 లక్షలు మాయం
కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం జరిగింది. ఈ ఘటనలో సురే వేణు అనే బాధితుడి నుంచి రూ.85 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం. బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మోసంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్