సామర్లకోట ఆలయం మూసివేత

449చూసినవారు
చంద్రగ్రహణం సందర్భంగా సామర్లకోట పంచారామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. అంతకుముందు పౌర్ణమిని పురస్కరించుకుని ఈవో బండ్ల నీలకంఠం ఆధ్వర్యంలో బాల త్రిపుర సుందరీ దేవికి, భీమేశ్వర స్వామికి విశేష అభిషేకాలు చేశారు. గ్రహణం కారణంగా పూజల అనంతరం ద్వారాలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం మహా సంప్రోక్షణ నిర్వహించిన తర్వాత యథావిధిగా స్వామివారి దర్శనాలు కల్పిస్తామని ఈవో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్