చోరీల కేసుల ఛేదనలో ప్రతిభ.. పోలీసులకు ఎస్పీ రివార్డులు

201చూసినవారు
సామర్లకోట పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసులను ఛేదించి, నిందితులను అరెస్టు చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు. శనివారం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రివార్డులు అందజేశారు. సీఐలు ఏ. కృష్ణ భగవాన్, అంకబాబు, ఎస్‌ఐ రాజా, క్రైమ్ సిబ్బంది ఈ పురస్కారాలు అందుకున్నారు. నేరాల నియంత్రణలో వారి కృషి ప్రశంసనీయమని డీఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్