
పిఠాపురం: ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న ఏలేరు వాగు
పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు, శుద్ధగెడ్డ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న ఉదయం తగ్గిన వరద మధ్యాహ్నానికి మళ్లీ పెరిగింది. ఏలేరు క్యాచ్మెంట్ ఏరియాలో అధిక వర్షాల కారణంగా రాత్రికి వరద ప్రమాద స్థాయికి చేరుకుంది. దీంతో పిఠాపురం, గొల్లప్రోలులోని ఏలేరు, గొర్రె ఖండి సుద్దగెడ్డ కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తూ రైతులు, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.


































