రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి

2362చూసినవారు
రైలు ఢీకొని 30 గొర్రెలు మృతి
గొల్లప్రోలు శివారున శనివారం సాయంత్రం విశాఖ వైపు వెళ్లే రైలు ఢీకొని పొలాల నుంచి వస్తున్న మందలో 30 గొర్రెలు మృతి చెందాయి. మరో పది తీవ్రంగా గాయపడ్డాయి. భీమా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని వాటి పోషకుడు గొర్ల వెంకటరమణ కోరుతున్నారు. పశుపోషణ ఆధారంగా జీవిస్తున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you