600 కిలోల జంతుకొవ్వు స్వాధీనం

329చూసినవారు
600 కిలోల జంతుకొవ్వు స్వాధీనం
గొల్లప్రోలు మండలం చెందుర్తి నుంచి కోటనందూరుకు ఆటోలో తరలిస్తున్న 600 కిలోల జంతుకొవ్వును రౌతులపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో డ్రమ్ము, 27 డబ్బాల్లో ఉన్న ఈ నిల్వలను పట్టుకోవడంతో కల్తీ నెయ్యి తయారీ కోణం వెలుగులోకి వచ్చింది. మల్లవరం కేంద్రంగా ఈ అక్రమ దందా సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్