యు. కొత్తపల్లి మండలం కొండెవరం శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గోదావరి కాలువ వద్ద ఆటో వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కాలువలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు ఒక మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.