గొల్లప్రోలు పట్టణంలోని మార్కండేయపురం రావిచెట్టు వద్ద గల సత్తెమ్మ తల్లి ఆలయంలో విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని పట్టణ పురవీధుల్లో తిరుగుతూ అమ్మవారికి సమర్పించారు. దీంతో గొల్లప్రోలు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని దుర్గాదేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.