కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొడవలి గ్రామంలో సోమవారం
జియో టవర్‌కు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో తోట రాజబాబుకు చెందిన పాడి గేదె మృతి చెందింది. సుమారు రూ. 1.50 లక్షల విలువైన గేదె మరణంతో రైతు తీవ్ర నష్టపోయారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ గోడ లేకపోవడం, భద్రతా ఏర్పాట్లు లోపించడమే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపించారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, రైతుకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.