గొల్లప్రోలు పట్టణానికి చెందిన మడికి బాబి, కాకాడ శివాజీ అనే యువకుల నుంచి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి విసంపల్లి సిరీల్ రూ. 80 వేలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సిరీల్ ఫోన్‌కి అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు సిరీల్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్. రామకృష్ణ తెలిపారు.