పిఠాపురం మోహన్ నగర్ ప్రాంతంలో శనివారం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ అపరిశుభ్రత ఉండటంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, 10 రోజుల్లోగా చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో పవన్ కళ్యాణ్ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.