చేబ్రోలు పీహెచ్సీలో రోగి మృతిపై డీఎంహెచ్ఓ విచారణ

1374చూసినవారు
గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందక ఓ రోగి మృతి చెందిన సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నరసింహ నాయక్ విచారణ జరిపారు. జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నామని, రోగి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మండల హెడ్ క్వార్టర్లో కచ్చితంగా ఉండాలన్నారు. ఈ సంఘటనలో సిబ్బంది బాధ్యతారాహిత్యం ఉందని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్