గొల్లప్రోలు పట్టణంలో శుక్రవారం ఉదయం మొగలి సూర్యుడి చెరువులో ఓ యువకుడు కలువ పువ్వులు కోయడానికి దిగి గల్లంతయ్యాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు, కానీ యువకుడు దొరకకపోవడంతో గాలింపును ముమ్మరం చేశారు.