గొల్లప్రోలు-తాటిపర్తి రహదారిపైకి భారీగా చేరిన వరద నీరు

971చూసినవారు
గొల్లప్రోలు-తాటిపర్తి రహదారిపైకి భారీగా చేరిన వరద నీరు
కాకినాడ, పిఠాపురం ప్రాంతాలలో అల్పపీడన ప్రభావంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుద్దగడ్డ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రికి నీటిమట్టం మరింత పెరగడంతో గొల్లప్రోలు-తాటిపర్తి రోడ్డుపై రెండడుగుల మేర వరద నీరు చేరింది. ఈ తీవ్ర ప్రవాహంతో పొలాల్లో ఉన్న రైతులు ఇళ్లకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే విధంగా వర్షాలు కురుస్తే వరద మరింత ముంచెత్తుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్