చెందుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 10 మందికి గాయాలు

1009చూసినవారు
గొల్లప్రోలు మండలం చెందుర్తి వద్ద ఆదివారం రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైవే మెయింటనెన్స్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్