పిఠాపురంలో జూన్ 6న మెగా జాబ్ మేళా

972చూసినవారు
పిఠాపురంలో జూన్ 6న మెగా జాబ్ మేళా
పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూన్ 6న ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళా జరగనుంది. ఏపీఎస్ఎస్డీసీ, ఉపాధి-నైపుణ్యాభివృద్ధి శాఖలు, పాడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 30 ప్రైవేటు సంస్థలు పాల్గొంటాయి. పదోతరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వరకు, 18-35 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగులు అర్హులు. అభ్యర్థులు 'నైపుణ్యం' పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్