విద్యార్థుల విజ్ఞప్తి మేరకు, కాకినాడ, పిఠాపురం, రాజమహేంద్రవరం మధ్య కొత్త బస్ సర్వీస్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. తుని డిపో నుంచి ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది. తుని నుంచి ఉదయం 5:30, మధ్యాహ్నం 2 గంటలకు, రాజమహేంద్రవరం నుంచి ఉదయం 9:30, సాయంత్రం 6 గంటలకు బస్సులు బయలుదేరతాయి. ఈ కొత్త సర్వీస్
విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.