పిఠాపురం కమిషనర్ కనకారావు తనను దుర్భాషలాడారని శానిటరీ సెక్రటరీ ఆరోపించగా, మంగళవారం సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపడతామని పాడా పీడీ శివరామ ప్రసాద్ తెలిపారు. అవసరమైతే ఈ సమస్యను కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పీడీ స్పష్టం చేశారు.