పిఠాపురం: 7 రోజులే గడువు.. లేదంటే ఇళ్లు రద్దు

1430చూసినవారు
పిఠాపురం: 7 రోజులే గడువు.. లేదంటే ఇళ్లు రద్దు
పిఠాపురం గోర్స్ రోడ్ ప్రాంతంలోని టిడ్కో గృహాల లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ కనకారావు కీలక ప్రకటన చేశారు. మొత్తం 864 ఇళ్లలో 627 మంది ఇప్పటికే గృహ ప్రవేశం చేశారు. మిగిలిన వారిలో 140 మంది ఇంకా బకాయిలు చెల్లించలేదు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారికి చివరి అవకాశంగా 7 రోజుల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ గడువులోగా డబ్బులు చెల్లించని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్