పోలీసుల అత్యుత్సాహం.. జనసేన నేతలు అసహనం

8చూసినవారు
పోలీసుల అత్యుత్సాహం.. జనసేన నేతలు అసహనం
పిఠాపురం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని పలువురు జనసేన నాయకులు ఆరోపించారు. భద్రత పేరుతో ఆయన సిబ్బంది కోసం తెచ్చిన అల్పాహారాన్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు వినలేదని వాపోయారు. టిఫిన్‌ను వెనక్కి పంపడంపై జనసేన నేతలు అసహనం వ్యక్తం చేశారు.