అక్టోబర్ ఒకటో తేదీన పిఠాపురంలోని ఓ హాస్పిటల్లో భాస్కర లక్ష్మి అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు పచ్చకామెర్లు రావడంతో మరో ఆసుపత్రికి తరలించారు. బాబు ఆరోగ్యం విషమించిందని కాకినాడకు తరలించాలని వైద్యులు సూచించారు. సరైన వైద్యం అందించకపోవడం వల్లే పచ్చకామెర్లు పెరిగాయని భాస్కర్ లక్ష్మి బంధువులు ఆరోపిస్తూ శనివారం రాత్రి ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు.