అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు

3చూసినవారు
అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు
పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎటువంటి అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి పిఠాపురంలో తాత్కాలిక బాణసంచా అమ్మకాలకు అనుమతులు పొందిన దుకాణదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. దుకాణాల వద్ద ఇసుక, నీళ్ల తొట్టెలు తప్పనిసరిగా ఉంచాలని, ధూమపానం, గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే పరికరాలు వాడరాదని, లైసెన్స్ షరతులు తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు.

ట్యాగ్స్ :