గొల్లప్రోలు పట్టణంలో బస్టాండ్ వద్ద గల బేతేలు ఆరాధన మందిరంలో విరామ బైబిల్ పాఠశాల (వీబీఎస్) తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ శిక్షణ జరగనుంది. సండే స్కూల్ పిల్లల కోసం బైబిల్ పాఠాలు, క్రాఫ్ట్స్, ఆటలు, పాటలు, పప్పెట్ షో వంటి కార్యక్రమాలు ఉంటాయి. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఈ తరగతులకు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.