
ప్రతిపాడు: నల్లపాడు లో అర్థరాత్రి ఒక ఆటో రెండు బైకులు దగ్ధం
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఆటో, రెండు బైక్లకు నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో పాత కక్షలా లేక రాజకీయ కక్షలా అనే దానిపై చర్చ మొదలైంది. బాధితులు సోమవారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



































