కాకినాడ, ప్రత్తిపాడు మండలంలో అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.