నేడు సత్యదేవుని ఆలయం మూసివేత

673చూసినవారు
నేడు సత్యదేవుని ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా మంగళవారం అన్నవరం సత్యదేవుని ఆలయం మూసివేయబడుతుంది. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు గ్రహణం ఏర్పడుతుందని పండితులు తెలిపారు. ఉదయం 9.30 లోపు వ్రతాలు, పూజలు పూర్తవుతాయి. 10 గంటల నుంచి దర్శనాలు నిలిపివేసి, సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, పంచహారతులు రద్దు చేశారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం నుంచి యధావిధిగా దర్శనాలు, పూజలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్