కాకినాడ, ప్రత్తిపాడు (తూ.గోదావరి) పరిధిలోని శంఖవరంలో ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దకాలంగా భారీ టిప్పర్ల రాకపోకల వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పాటు రోడ్లు ధ్వంసమయ్యాయని, వర్షపు నీటితో నిండిన గుంతల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. అధికారులు స్పందించి నూతన రోడ్డు నిర్మించి, టిప్పర్లను మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు.