ఉపాధి పనుల్లో గుండెపోటుతో శ్రామికుడి మృతి

226చూసినవారు
ఉపాధి పనుల్లో గుండెపోటుతో శ్రామికుడి మృతి
ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామానికి చెందిన లింగంపల్లి చక్రధరరావు (55) అనే ఉపాధి హామీ శ్రామికుడు బుధవారం విధుల్లో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా అస్వస్థత కలగడంతో సహచర కార్మికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్