ద్రాక్షారామ: గుర్తు తెలియని వృద్ధుడు మృతి

1642చూసినవారు
ద్రాక్షారామ: గుర్తు తెలియని వృద్ధుడు మృతి
ద్రాక్షారామ భీమేశ్వర థియేటర్ కాంప్లెక్సు ఎదురుగా అరుగుపై మంగళవారం గుర్తుతెలియని 70 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. దాదాపు ఇరవై ఏళ్లుగా భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఈ వృద్ధుడు చలి తీవ్రత కారణంగా మృతిచెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో, పంచాయతీ అధికారుల సహకారంతో శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

సంబంధిత పోస్ట్