విజయవాడ బస్టాండ్ ఎదుట రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు కలకలం రేగింది.