
తాండవ జలాశయం గేట్లు ఎత్తివేత
మొంథా తుపాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, తునిలోని తాండవ జలాశయం నుంచి రెండు గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. దీంతో తాండవ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాలువలు, గెడ్డల నుంచి నీరు చేరడంతో ప్రవాహం మరింత పెరిగింది. ఈ పరిస్థితితో పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.





































