సెజ్ భూములను చంద్రబాబు తన బినామీకి కట్టబెట్టారు

1309చూసినవారు
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తనపై ఓ వర్గం మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మండిపడ్డారు. తునిలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ, దమ్ముంటే వాస్తవాలు నిరూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం భూములను ఎకరం రూ. 100కే ఇస్తే గొప్పగా కనిపిస్తుందా, రైతుల భూములను మార్కెట్ ధరకే కొంటే తప్పా అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ హయాంలో రూ. 370 కోట్లతో కొన్న సెజ్ భూములను చంద్రబాబు తన బినామీకి కట్టబెట్టారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్