తునికి చెందిన ఓ దివ్యాంగ యువకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రత్యక్షంగా చూడాలనే కోరికతో తన తల్లిదండ్రులతో కలిసి సోమవారం చామవరం చేరుకున్నాడు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు వచ్చి ఆయనను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూశాడు. కుమారుడి కోరిక నెరవేర్చాలని తల్లిదండ్రులు ప్రత్యేకంగా అక్కడికి తీసుకువచ్చారు.