ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మైనర్ బాలికలపై వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. తునిలో వృద్ధుడు ఒక బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, అరెస్టు తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమండ్రిలో మరో బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. ఐ.పోలవరం మండలంలో పదేళ్ల బాలికపై బాబి అనే వ్యక్తి ఆరుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాలికల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.