తునిలో జీఎస్టీ 2.0 అవగాహన సదస్సు: ఎమ్మెల్యే దివ్య కీలక వ్యాఖ్యలు

988చూసినవారు
కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో గురువారం నాడు ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన జీఎస్టీ 2.0 అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ, జీఎస్టీ పన్ను తగ్గింపుతో అన్ని వర్గాల వారికి ఆర్థికంగా మేలు జరుగుతుందని తెలిపారు. తుని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా, సిబ్బందికి జీఎస్టీ పై అధికారులు ఈ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భవన సుందరి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, టిడిపి నాయకులు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి తదితర నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్