తునిలో భారీ వర్షం

1203చూసినవారు
తునిలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షం కారణంగా ప్రకాశం రోడ్, నారాయణరాజు గారి వీధి, గవరపేట ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీపావళి దుకాణాలకు కూడా వర్షంతో ఇక్కట్లు తప్పలేదు.

సంబంధిత పోస్ట్